E-PAPER

జగ్గారంలో బిర్స ముండా 150వ జయంతి వేడుకలు

అశ్వాపురం,నవంబర్15 వై 7న్యూస్;

అశ్వాపురం మండలం జగ్గారం పంచాయతీ కార్యాలయంలో ఆదివాసి జాతి పోరాట వీరుడు బిర్స ముండా జన్మదినోత్సవం ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు గ్రామ ప్రజలతో గ్రామసభ ఏర్పాటు చేసి వేడుక నిర్వహించారు. జన్మదినోత్సవం వేడుకని ఉద్దేశించి మాట్లాడుతూ గిరిజన జాతి పట్ల బ్రిటిష్ ప్రభుత్వం పాలనలో ఆదివాసి జాతికి అన్యాయం జరుగుతుంది అని అతి చిన్న వయసులోనే గుర్తించి పోరాట మార్గాన్ని ఎంచుకొని ప్రజలకి తెలియపరచి ఉద్యమం వైపు నడిపించిన వీరుడు బిర్స ముండా అనీ కొనియాడినారు. బిర్స ముండని రెండు సంవత్సరాలు జైలు లో నిర్బంధించినారు. బిర్స ముండా ఆదివాసులకు వైద్యుడు అడివిలో దొరికే అటవీ వనమూలికలతో వైద్యం అందించి నయం చేసేవారు. ఈ విధంగా చేస్తూ మద్యపాన నిషేధం, మతం మార్పు విధానంపై బలిదానాలపై మాంసాహరాలపై వ్యతిరేకమైన కార్యక్రమాలు ఆనాడు ప్రజలలో చైతన్యం నిర్వహించారు. వీరి పోరాటాలని ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం గుర్తించిన చరిత్ర పదిలం..ఈ సందర్భంగా కారం శ్రీరాములు మాట్లాడుతూ ఈనాటి ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం గానీ బిర్స ముండా జయంతి సందర్భంగా ఆదివాసులకు సంబంధించిన అభివృద్ధి కొరకు ఏదైనా పథకం ఏర్పాటు చేస్తే బాగుంటుందని తెలియజేశారు.
నేడు రాష్ట్రపతి మహిళ మురుము కూడా ఆదివాసి ఆడపడుచు కావున దేశవ్యాప్తంగా నేటి ప్రభుత్వాలు గుర్తించి జయంతులు నిర్వహించాలని తెలియపరిచిన సందర్భంగా గ్రామసభ కార్యక్రమంలో
బిర్స ముండా చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పించి వేడుక నిర్వహించారు
ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ వెంకటేశ్వరరావు ఉపాధి హామీ అధికారి లక్ష్మణ్ రావు గ్రామ పెద్దలు గిరిజన నాయకులు కారం శ్రీరాములు కట్టం. ఎర్రప్ప ,సోయం వెంకటేశ్వరావు కారం వసంతరావు ,తోలెం. దుర్గ, వాడే వెంకటేశ్వరావు , ఊకే.శ్రీనివాస్, పద్దం శంకర్, టీఏ లక్ష్మయ్య , అంగన్వాడి టీచర్లు,ఆశ వర్కర్లు, గ్రామ ప్రజలు మహిళలు యూత్ తదితరులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేసారు..

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :