E-PAPER

పంచాయతీ కార్మికుడు తరుణ్ కుటుంబానికి 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలి; TUCI డిమాండ్

మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలి

జిల్లా అధ్యక్ష కార్యదర్శులు
ఆర్ మధుసూదన్ రెడ్డి షేక్ యాకుబ్ షావలి

జూలూరుపాడు,నవంబర్12 వై 7 న్యూస్;

కరెంట్ షాక్ తగిలి ప్రమాదంలో చనిపోయిన జూలూరుపాడు మండలం చింతల్ తండా గ్రామపంచాయతీ మల్టీపర్పస్ వర్కర్ తరుణ్ కుటుంబానికి 25 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా
టియుసిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, ఆర్ మధుసూదన్ రెడ్డి షేక్ యాకుబ్ షావలి డిమాండ్ చేశారు. మంగళవారం వారు మాట్లాడుతూ
అధికారుల నిర్లక్ష్యం మూలంగా ,
మల్టీపర్పస్ వర్కర్లకు ఇష్టం వచ్చిన విధంగా పనులు చెప్పటం మూలంగా, కరెంటు స్తంభానికి బల్పును అమర్చే సమయంలో చెట్టుకొమ్మను నరుకుతూ కరెంట్ షాక్ తగలడంతో ప్రమాదవశాత్తు తరుణ్ చనిపోయాడని వారుఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదంలో చనిపోయిన తరుణ్ కుటుంబానికి గ్రామపంచాయతీ వర్కర్స్ కి చెల్లిస్తున్న పదిలక్షల రూపాయల ఇన్సూరెన్స్ తో పాటు, 25 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషియా చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగాన్ని ఇవ్వాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికుల పట్ల మొండివైఖరితో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని,నేడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికులకు మేలు చేసేందుకు కృషి చేయకుండా నిమ్మకు నేరెత్తినట్లుగా వ్యవహరిస్తుందని ఆరోపించారు.
తక్షణమే చనిపోయిన గ్రామపంచాయతీ కార్మికుడు బానోత్ తరుణ్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోకపోతే ఆందోళన చేపడుతామని వారు ఈ సందర్భంగా హెచ్చరించారు.
ప్రమాదానికి కారుకులైన అధికారులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్