E-PAPER

సింగరేణి ప్రధాన కార్యాలయము నందు సింగరేణి ఎస్‌సి, ఎస్‌టి ఉద్యోగస్తుల లైసన్ సెల్ ఆఫీస్ ప్రారంబోత్సవం

హైదరాబాద్, నవంబర్ 12 వై7 న్యూస్

సింగరేణి ప్రధాన కార్యాలయము నందు సింగరేణి సంస్థ ఛైర్మన్ & మేనేజింగ్ డైరక్టర్ ఎన్.బలరామ్, ఐ‌ఆర్‌ఎస్ ఆదేశాల మేరకు ఈ రోజు తేదీ: 12.11.2024 మంగళవారం నాడు సింగరేణి సంస్థ నందు పని చేసే ఎస్‌సి & ఎస్‌టి ఉద్యోగుల సమస్యల పరిష్కారము కొరకులైసన్ సెల్ ఆఫీస్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తెలంగాణ రాష్ట్ర ఎస్‌సి & ఎస్‌టి కమీషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య మరియు విశిష్ట అతిధి గా డైరక్టర్ (పి&పి) & పా జి.వేంకటేశ్వర రెడ్డిలు హాజరై శిలాఫలకాన్ని ఆవిష్కరించి లైసన్ సెల్ ఆఫీస్ ను ప్రారంభించారు.

ఈ సంధర్భముగా ముఖ్య అతిధి గౌరవ తెలంగాణ రాష్ట్ర ఎస్‌సి & ఎస్‌టి కమీషన్ ఛైర్మన్ శ్రీ బక్కి వెంకటయ్య గారు మాట్లాడుతూ సింగరేణి సంస్థ లో పని చేసే ఎస్‌సి మరియు ఎస్‌టి ఉదోగస్తుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు వీలుగా ఈ రోజు మనం సింగరేణి ప్రధాన కార్యాలయము నుందు ఎస్‌సి& ఎస్‌టి లైసన్ సెల్ ను ప్రారంభించుకోవటం చాలా సంతోషాదయకమని, గత నెలలో సింగరేణి భవన్ నందు నిర్వహించిన ఎస్‌సి & ఎస్‌టి యూనియన్ నాయకుల సమావేశం లో సింగరేణి సంస్థ సి&ఎం‌డి శ్రీ ఎన్.బలరామ్, ఐ‌ఆర్‌ఎస్ గారితో ఎస్‌సి& ఎస్‌టి లైసన్ సెల్ గురించి మాట్లాడిన వెంటనే కార్యాలయ ప్రారంభానికి ఆఫీస్ ను కేటాయించి అన్ని ఏర్పాట్లు చేపించారని, డాక్టర్ బి‌ఆర్.అంబేడ్కర్ గారు చెప్పినట్లు బోధించు, సమీకరించు, పోరాడు అనే సిద్దాంతలను పాటిస్తూ మన ఎస్‌సి& ఎస్‌టి ఉద్యోగులు అందరూ ఐకమత్యముగా ఉండి సమస్యలపై ప్రశ్నించి సాధించుకోవాలని తెలిపారు.

విశిష్ట అతిధి డైరక్టర్ (పి&పి) & పా శ్రీ జి.వేంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడుతూ ఈ రోజు మన సింగరేణి సంస్థ ఎస్‌సి మరియు ఎస్‌టి ఉదోగస్తుల చిరకాల కోరిక అయిన లైసన్ సెల్ ప్రారంభించుకోవటం చాలా సంతోషం అని ఈ యొక్క ఎస్‌సి& ఎస్‌టి లైసన్ సెల్ యొక్క ముఖ్య ఉద్దేశం సింగరేణి సంస్థ లో ఎస్‌సి& ఎస్‌టి ఉద్యోగులకు ఏదయినా సమస్యలు ఉంటే సంబంధిత లైసన్ సెల్ ఇంచార్జ్ గారికి వ్రాతపూర్వకముగా ఇస్తే సమస్యను త్వరితగతిన పరిష్కరించుకో వచ్చని తెలిపారు.

ఈ కార్యక్రమం లో గౌరవ తెలంగాణ రాష్ట్ర ఎస్‌సి & ఎస్‌టి కమీషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య తో పాటు డైరక్టర్ (పి&పి) & పా జి.వేంకటేశ్వర రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఎస్‌సి & ఎస్‌టి కమిషన్ సభ్యులు కే.నీలా దేవి, రాంబాబు నాయక్, కొంకటి లక్ష్మీనారాయణ, జిల్లా శంకర్, రేణికుంట్ల ప్రవీణ్, జి‌ఎం(పర్సనల్) ఐ‌ఆర్& పి‌ఎం కవితా నాయుడు, జి‌ఎం మణుగూరు & ఎస్‌సి చీఫ్ లైసన్ ఆఫీసర్ దుర్గం రామ్ చందర్, ఓ‌ఎస్‌డి జి‌ఎం O/o ఇల్లందు & ఎస్‌టి చీఫ్ లైసన్ ఆఫీసర్ వీసం కృష్ణయ్య, సింగరేణి ఎస్‌సి & ఎస్‌టి ఉద్యోగస్తుల వెల్ఫేర్ సంఘం ప్రెసిడెంట్ డాక్టర్ ఈ రాజేశ్వర్, జనరల్ సెక్రటరీ అంతోటి నాగేశ్వర రావు, సింగరేణి ఎస్‌టి ఉద్యోగస్తుల వెల్ఫేర్ సంఘం ప్రెసిడెంట్ ఏ.భాస్కర్ రావు, జనరల్ సెక్రటరీ బి.నాగేశ్వర రావు, సి‌ఎం‌ఓ‌ఏ‌ఐ ప్రెసిడెంట్ శ్రీ టి.లక్ష్మీ పతి గౌడ్, డి‌జి‌ఎం (పర్సనల్) ఐ‌ఆర్ వింగ్ & లైసన్ సెల్ ఇంచార్జ్ కే.అజయ్ కుమార్, గుర్తింపు సంఘం ఏ‌ఐ‌టి‌యూ‌సి బ్రాంచ్ సెక్రటరీ రమణ మూర్తి, ప్రాతినిధ్య సంఘం ఐ‌ఎన్‌టి‌యూ‌సి జనరల్ సెక్రటరీ సి.త్యాగరాజన్ మరియు ఎస్‌సి & ఎస్‌టి యూనియన్ నాయకులు , అధికారులు ఉద్యోగులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :