E-PAPER

ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసిన ఎంఈఓ

పినపాక,అక్టోబర్18 వై 7 న్యూస్;

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండల పరిధిలోని పలు గ్రామాలలో గల ప్రభుత్వ పాఠశాలలను శుక్రవారం మండల విద్యాశాఖ అధికారి నాగయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలకు సంబంధించిన పలు రికార్డులను పరిశీలించారు.
ఉప్పాక పాఠశాలను ఉదయం 9గంటలకు సందర్శించి పాఠశాల అసెంబ్లీలో పాల్గొని ఉపాధ్యాయుల పనితీరును పరిశీలించి,పాఠశాల అభివృద్ధి కి పలు సూచనలు చేశారు. అనంతరం ఎంపీపీఎస్ పెంటన్న గూడెం, ఎంపీపీఎస్ మడతన కుంట, ఎంపీపీఎస్ సీతంపేట, జిపిఎస్ బంధగిరి నగరం, ఎంపీపీఎస్ భూపాల పట్నo, ఎంపీపీఎస్ బెస్తగూడెం, ఎంపీ యుపిఎస్ జగ్గారం పాఠశాల లను సందర్శించి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు.
విద్యార్థుల హాజరు శాతాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం ఆయా తరగతుల విద్యార్థుల వద్దకు వెళ్లి పాఠ్యాంశాలను చదివించారు. ఎప్పటి పాఠ్యాంశాలను అప్పుడే చదివితే పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించవచ్చు అని ఆయన విద్యార్థులకు సూచించారు. మంచి ఫలితాలు సాధించి పాఠశాలకు పేరు తీసుకురావాలని ఎంఈఓ సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సీఆర్పీలు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్