E-PAPER

కాంగ్రెస్ నాయకుడు రఘు పార్థివాదేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన మంత్రి సీతక్క

ముద్రబోయిన రఘు మరణం చాలా బాధాకరం కాంగ్రెస్ పార్టీకీ తీరని లోటు

కుటుంబ సభ్యులను ఓదార్చి ఎల్లవేళలా అండగా ఉంటామని హామీ ఇచ్చిన మంత్రి సీతక్క

ఏటూరునాగారం,అక్టోబర్12 వై 7 న్యూస్;

ములుగు జిల్లా, ఏటూరునాగారం మండలం, షాపెల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మండల నాయకుడు ముద్రబోయిన రఘు కాలేయ వ్యాధి సమస్యతో బాధపడుతూ తెల్లవారుజామున మృతి చెందగా శనివారం సాయంత్రం పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ది, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క వారి స్వగృహమునకు వెళ్లి మృతుని పార్థివాదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారి కుటుంబానికి ఎల్లప్పుడు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్