E-PAPER

సాయుధ పోరాట నిప్పు కనిక- చాకలి( చిట్యాల) ఐలమ్మ

ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

రజక కుల పెద్దలను సన్మానించిన పార్టీ శ్రేణులు

మాజీ ఎంపీటీసీ -కమటం నరేష్

అశ్వాపురం, సెప్టెంబర్ 26 వై 7 న్యూస్ ప్రతినిధి;

అశ్వాపురం మండలం మొండికుంట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎంపీటీసీ కమటం నరేష్ అధ్యక్షతన చాకలి ఐలమ్మ 129వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆమె చిత్రపటానికి రజక సంఘ నాయకుడు చెన్నూరి అంతయ్య , నెల్లిపాక సొసైటీ ఛైర్మన్ తుక్కాని మధుసూధన్ రెడ్డి పూలమాలలు వేసి రజక సంఘం నాయకులూ కేక్ కట్ చేసి ఘన నివాళులు అర్పించారు.ఈ నేపథ్యంలో కమటం నరేష్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి (చిట్యాల) ఐలమ్మ ఆనాడు గడీలపై గళమెత్తి భూ పోరాటానికి నాంది పలికిన ఐలమ్మ బహుజన ఆత్మగౌరవానికి, మహిళా చైతన్యానికి ప్రతీకగా నిలుస్తారని స్మరించుకున్నారు. మహిళా లోకానికి స్పూర్తిగా నిలుస్తున్న వీరనారి ఐలమ్మగారి పేరును కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కోఠీలోని మహిళా విశ్వవిద్యాలయానికి ఆమె పేరును పెట్టిన విషయాన్ని గుర్తుచేసుకుంటూ, భూమి కోసం,భుక్తి కోసం,వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి,తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటిచెప్పి,మహిళా లోకానికి స్పూర్తినిచ్చిన ధీరవనిత అని, ఆ యోధురాలి వారసులకు సముచిత గుర్తింపును కాంగ్రెస్ పార్టీ కల్పించిందని అన్నారు ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో చాకలి (రజక)కుల పెద్దలను గౌరవ సన్మానాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,రజక సంఘం పెద్దలు మహిళలు యువజన నాయకులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :