బీర్కూర్ సెప్టెంబర్25 వై సెవెన్ న్యూస్
కొండ గంగారం ప్రతినిధి;
బీర్కూర్ మండలంలోని రెండు నెలల క్రితం రేషన్ షాపుల భర్తీ కోసం చేపట్టిన, రాత పరీక్ష, ఇంటర్వ్యూ లో అధిక మార్కులు సాధించిన. బీర్కూర్ మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన పుల్లెని విట్టల్, బీర్కూరు మండల కేంద్రానికి చెందిన కవిత, శివకుమార్ లకు అత్యధిక మార్కులు రావడంతో వారికి ఇంచార్జ్ షాపులను కేటాయించడం జరిగింది . ఈ రేషన్ షాపుల కొరకు నియామక పత్రాలను బీర్కూర్ మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ లతా కుమారి అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ రవికుమార్. రెవెన్యూ సిబ్బంది. తదితరులు పాల్గొన్నారు.
Post Views: 47