. నూతన కోపరేట్ సొసైటీ అధ్యక్షుడిగా పెదిరెడ్ల శ్రీనివాసరావు
అశ్వాపురం, సెప్టెంబర్ 14 వై 7 న్యూస్
అశ్వాపురం మండల కేంద్రంలోని గౌతమి నగర్ కాలనీలో హెవీ వాటర్ ప్లాంట్ ఈసిసిఎస్ రిజిస్ట్రేషన్ నెం 627/టిఈఈ కోపరేట్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ కోపరేట్ సొసైటీ అధ్యక్షుడు పెది రెడ్ల శ్రీనివాసరావును ఎన్నికల అధికారి కనకదుర్గ సమక్షంలో ఏకగ్రీవంగాఎన్నుకున్నారు.
ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఎన్నికలలో భాగంగా గతంలో 2021 జనవరి 27 ఎన్నికలు కోపరేట్ సభ్యులు ఆధ్వర్యంలో కళంగి గురువయ్య ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.గురువయ్య 2024 మార్చి 31న పదవీ కాలం ముగియడంతో ఆయన సొసైటీ అధ్యక్ష పదవి కి రాజీనామా చేసిన తర్వాత ఆయన స్థానంలో ఉపాధ్యక్షులుగా ఉన్న శ్రీ లత ను తాత్కాలికంగా అధ్యక్షులు గా నియమించినారు. గురువయ్య రాజీనామా చేసిన స్థానములో జలగం అన్వేష్ ను కోపరేట్ సొసైటీ డైరెక్టర్ గా ఏకగ్రీవంగా సొసైటీ సభ్యులు ఎన్నుకున్నారు.శుక్రవారం ఎన్నికల సీనియర్ అధికారి కనకదుర్గ సూచన మేరకు శుక్రవారం కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో పెదిరెడ్ల శ్రీనివాసరావు ని అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత సంవత్సరల నుండి సొసైటీ అభివృద్ధిలో నడుస్తుందని ఇప్పటి వరకు 32 కోట్ల టర్నోవర్ తో ఉన్న సొసైటీ ని కమిటీ సభ్యులు తో మరింత అభివృద్ధి చేస్తానని అదేవిధంగా సొసైటీలో లోన్ తీసుకున్న ప్రతి సభ్యుడికి ఇన్సూరెన్స్ వచ్చేలా పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఇన్సూరెన్స్ అమలయ్యే విధంగా ప్రయత్నిస్తానని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సొసైటీ కమిటీ సభ్యులు అధ్యక్షులు పెదిరెడ్ల శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు జి.శ్రీలత, కార్యదర్శి ఎస్ కళ్యాణ చక్రవర్తి,ట్రెజరర్ వెంకటేశ్వర్లు,డైరెక్టర్లు, పోగు కొమరయ్య ,శిల్ప,అన్వేష్ కమిటీ సభ్యులు , హెవీ వాటర్ ప్లాంటు కోపరేట్ సభ్యులు,యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు