. సిగ్నల్ టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్ శివారెడ్డి తప్పుడు వార్తలు చదివి పూట గడుపుకుంటున్నాడు
. సిగ్నల్ టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్ శివారెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్
. ప్రజలు నమ్మక,ప్రజాదారణ పొందలేక అసత్య ప్రచారాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న బిఆర్ఎస్ పార్టీ
. అవినీతి బిఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజానీకం నమ్మే పరిస్థితి లేదు
. బిఆర్ఎస్ పెయిడ్ బ్యాచ్ తప్పుడు కథనాలకు పాల్పడితే ఖబడ్దార్
. యూత్ కాంగ్రెస్ జాయింట్ సెక్రెటరీ ఉల్లేరావు శ్రావణ్ కుమార్
ఈ సందర్బంగా యూత్ కాంగ్రెస్ జాయింట్ సెక్రటరీ ఉల్లేరావు శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ గ్రామీణ యువతకు నైపుణ్యం కల్పించడం కోసం దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన (DDU-GKY) స్కీం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తాయి. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా 60 శాతంగా కాగా..రాష్ట్ర ప్రభుత్వ వాటా 40 శాతం. అయితే ఈ స్కీంలో అవకతవకలు జరిగాయన్నట్లుగా ఒక యూట్యూబ్ ఛానెల్ మంత్రివర్యులు ధనసరి సీతక్క , కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ పై కుట్రపూరితమైన కథనాన్ని ప్రసారం చేసింది. ఇది పూర్తిగా అవాస్తవం. కనీసం కేంద్ర, రాష్ట్రాల నిధుల వాటా మీద, స్కీం అమలు, నిధుల విడుదల విధానం పట్ల ఏ మాత్రం అవగాహన లేకుండా కేవలం విషం చిమ్మడమే పనిగా కథనం నడిపారు తప్ప అందులో ఏలాంటి వాస్తవం లేదు.
యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా అత్యంత పారదర్శంగా నిధుల కేటాయింపు, విడుదల జరుగుతోంది. కేంద్ర నిబంధనలకు అనుగుణంగానే విడతల వారిగా నిధులు విడుదల అవుతాయి. 2019 నుంచి 2025 వరకు తెలంగాణలో 90 వేల మందికి నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు కేంద్రం 817 కోట్లు మంజూరు చేసింది. బీఆర్ఎస్ హయంలో 185 కోట్లు ఖర్చు అయ్యాయి. ఆ తర్వాత అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజురు చేయకపోవడం, నిబంధనలు పాటించకపోవడంతో కేంద్రం ఏడాది పాటు ఈ స్కీంను మన రాష్ట్రంలో నిలిపివేసింది. అందుకే నిధుల విడుదల విషయంలో మా ప్రభుత్వం ఆచి తూచి అడుగులు వేస్తుందని, టిఆర్ఎస్ పార్టీ నే ప్రజలు నమ్మక యూట్యూబ్ ఛానల్ ద్వారా తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారు.మా మంత్రివర్యులు ధనసరి అనసూయ సీతక్క గారి పై మరియు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ గారి పై ఎటువంటి అసత్య ప్రచారాలు చేసిన సహించేది లేని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సిగ్నల్ టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్ శివారెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.