E-PAPER

ఆధార్ పార్టీ స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం ఇంచార్జి గా పుట్ట వినోద్ నియామకం

. ఉత్తర్వులు జారీ చేసిన వ్యవస్థాపక అధ్యక్షులు ఈడా శేషగిరిరావు

. జిల్లాలో పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తా.. పుట్ట వినోద్

స్టేషన్ ఘనపురం, సెప్టెంబర్ 10 వై 7 న్యూస్;

ఆధార్ పార్టీ స్టేషన్ ఘనపురం ఇంచార్జి గా నియమించారు. ఈ మేరకు ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఈడా శేషగిరిరావు నుండి ఆయన నియామకపు ఉత్తర్వులను అందుకున్నారు. ఈ సందర్భంగా వినోద్ మాట్లాడుతూ జిల్లాలో పార్టీ బలోపేతం కోసం నిరంతరం అహర్నిశలు శ్రమిస్తానని తెలిపారు. నాపై ఎంతో నమ్మకం, విశ్వాసం ఉంచి ఈ పదవి అప్పగించారని, పదవికి వన్నె తెచ్చే విధంగా పనిచేస్తానని వెల్లడించారు. సమాజంలో వెనుకబడిన వర్గాల కోసమే ఆధార్ పార్టీ ఆవిర్భవించిందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల తో పాటు అగ్రకులంలో పేదలను గుర్తించి వారి సమస్యల పరిష్కారానికి పార్టీ అధినేత శేషగిరిరావు పార్టీని స్థాపించారని గుర్తు చేశారు. నాకు ఈ అవకాశం కల్పించిన హన్మకొండ అధ్యక్షులు గట్టు యూగందర్ గౌడ్ కు వారికి మరియు ఆధార్ పార్టీ రాష్ట్ర నాయకులకు బుదేయ్య జిల్లా అధ్యక్షులకు రఘునాయక్ తాళ్ల పెళ్లి రమేష్ కుక్కల నాగేశ్వర గౌడ్ పులారావు కిషోర్ ,కంటే కేశవ గౌడ్ ,నూప శ్రీరామ,పూనమ్ నరేష, వూకే.ముత్తయ్య దొర కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News