తీవ్ర ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు..
పట్టించుకునే వారే లేరంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు..
గత కొద్దిరోజులుగా కురిసిన వర్షాలకు చెరువు కట్టలు తెగిపోయి కందిబండ మేళ్లచెరువు కు వెళ్లే మార్గంలో ఉన్నటువంటి బ్రిడ్జి వరదలకు కృంగిపోయి కూలిపోయిన విషయం అందరికీ తెలిసిందే.. అధికారులు మాత్రం అటువైపు నుండి వాహనాల రాకపోకలు మాత్రమే ఆపగలిగారు కానీ.. నిత్యం స్కూల్ కి వెళ్లే విద్యార్థుల పరిస్థితి ఏమిటని.. తీవ్ర ఆందోళన చేస్తున్న గ్రామస్తులు. బ్రిడ్జి కూలినప్పటినుండి పట్టించుకోని నాధుడే లేడని బ్రిడ్జ్ మరమత్తులు చేయకపోగా.. కొత్తగా వేరే మార్గం నుండి దారి ఏర్పాటు చేసే చర్యలు కూడా తీసుకోలేదని నిత్యం కూలీలకు వెళ్లే రైతులు స్కూలుకు వెళ్లే చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని కొత్త మార్గం ఏర్పాటు చేసే విధంగా రాకపోకలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.









