E-PAPER

ఏజెన్సీలో ఉగ్రరూపం దాల్చిన వాగులు

. భారీ వర్షాలకు ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఏజెన్సీ గ్రామాల ప్రజలు

. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయిన వైనం

. వాగులో గల్లంతైన యువకులు మృతి

. వరదల కొట్టుకపోయిన ఆటోలు

గోడున విలపిస్తున్న ఆటో డ్రైవర్లు

అయ్యా జిల్లా కలెక్టర్ గారు మా గ్రామాల వైపు చూడండి అంటూ ఆర్తనాదాలు

వై సెవెన్ న్యూస్ అశ్వాపురం

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తుంది ఊహించని విధంగా వర్షపాతం నమోదు కావడం వలన వరదలు ఉప్పొంగి ఆస్తి నష్టం జరుగుతుంది కొన్నిచోట్ల అమాయక గిరిజనులు వరదలకు కొట్టుకపోవడంతో ప్రాణాలు కోల్పోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురవడం వలన సహాయక చర్యలు పట్టణాలకే పరిమితం కావడంతో ఏజెన్సీ ప్రాంతాలు విలవిలలాడుతున్నారు వాగులు ఉప్పొంగడంతో రవాణా సౌకర్యాలు నిలిచిపోయి ఇబ్బందులు పడుతున్నారు పురిటి నొప్పులు వచ్చిన మహిళలు నొప్పులు భరించలేక అల్లాడుతున్నారు దావకానకు వెళ్లాలి అంటే దారి లేక నరకయాతన పడుతున్నారు వివరాలు ఇలా ఉన్నాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల పరిధిలో గల ఏజెన్సీ గ్రామాలైన గొంది గూడెం జి కొత్తూరు ఎలకలగూడెం వేములూరు మనుబోతులపాడు భీమవరం రామవరం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి వాగులు ఉప్పొంగడంతో పార్కింగ్ చేసిన ఆటోలు సైతం కొట్టుకపోయాయి. ఆటోలు నడుపుతూ జీవనం కొనసాగిస్తున్న కుటుంబాలు రోడ్డున పడ్డాయి కొట్టుకుపోయిన ఏడు ఆటోలలో ఐదు ఆటోలు దొరకగా రెండు ఆటోలు కనిపించకుండా గల్లంతయినాయి. గొందిగూడెం ఏజెన్సీ ప్రాంతంలో పురిటి నొప్పులతో బాధపడుతూ ఆంబులెన్స్ కోసం కాల్ చేయగా బాబు ఉప్పొంగడంతో ఆంబులెన్స్ సైతం అక్కడే నిలిచిపోయాయి పురిటి నొప్పులు వస్తున్న మహిళ నొప్పులు భరించలేక నరకయాతన పడుతుంది అని ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. ప్రకృతి కన్నెర్ర చేయడంతో ఏజెన్సీ గ్రామాలు విలవిలలాడుతున్నాయి నిత్యం అశ్వాపురం వచ్చి నిత్యవసర సరుకులు కొనుగోలు చేసే ఏజెన్సీ గ్రామాల ప్రజలు రెండు రోజులుగా రాకపోకలు నిలిచిపోవడంతో తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతున్నారు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి మరోవైపు మొండికుంట ప్రాంతంలో లోతు వాగు ఉగ్రరూపం దాల్చడంతో ఇద్దరు యువకులు వాగులో గల్లంతు కావడం మృతదేహాలు దొరకడం సంచలనం సృష్టిస్తుంది ఎక్కడ చూసినా వరదలు ఉండడంతో కాలు బయట పెట్టలేని పరిస్థితి కనిపిస్తుంది అయ్యా జిల్లా కలెక్టర్ గారు మా గ్రామాల వైపు చూడండి అంటూ ఆదివాసి గ్రామాల ప్రజలు ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి మరి ఇప్పటికైనా పినపాక శాసనసభ్యులు స్పందించి ఏజెన్సీ గ్రామాల ప్రధాన రహదారులకు వాగులపై బ్రిడ్జిలు నిర్మాణాలు చేపట్టే అవకాశం చూడాలి అంటూ ఏజెన్సీ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు..

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్