E-PAPER

బిగ్ టీవీ రిపోర్టర్ ఫయాజ్ రిమాండ్

. అతని అనుచరులను అదుపులోకి తీసుకున్న కొత్తూరు పోలీసులు*

. ఫిర్యాదులు అందడంతో గతంలో చానళ్ల నుంచి తొలగించినట్టు వెల్లడి

కొత్తూరు,సెప్టెంబర్01 వై 7 న్యూస్

టీవీ రిపోర్టర్ ఫయాజ్ మునవర్ అతని అనుచరులను కొత్తూరు పోలీసులు ఆదివారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. మండలంలోని ఇన్ముల నర్వ గ్రామానికి చెందిన ఫయాజ్ మునవర్ గతంలో తొలివెలుగు, 4టీవీ, రాజ్ టీవీ రిపోర్టర్ గా గతంలో పనిచేశాడని కొత్తూరు సిఐ నరసింహారావు మీడియాతో తెలిపారు. జెపి దర్గా కాంట్రాక్టర్, సబ్ కాంట్రాక్టర్, వ్యాపారస్తులు, కంపెనీ యాజమాన్యం, స్కూళ్ల దగ్గరికి వెళ్లి రిపోర్టర్ ని అని బెదిరించి వసూళ్లకు పాల్పడేవాడనీ, ఈ విషయమై పలుమార్లు సంబంధిత చానల్లో హెడ్ ఆఫీస్ కు ఫిర్యాదులు వెళ్లాయనీ పేర్కొన్నారు. దీంతో అతన్ని రిపోర్టర్ విధుల నుంచి తొలగించారు. ఆ తర్వాత బిగ్ టీవీ యూట్యూబ్ ఛానల్ ను పని చేసుకున్నాడు. ఇముల నర్వ గ్రామానికి చెందిన మీర్జా షౌకత్, సదాక్,అలియాస్ మహమ్మద్ సాదిక్,ఎండి హర్షద్,ఎండి సయ్యద్,జమీల్ అన్సారి,అఖిల్ అన్సారి మరి కొంతమందితో వర్గాన్ని ఏర్పాటు చేసుకొని దౌర్జన్యాలకు పాల్పడుతున్నాడనీ, అయితే ఆగస్టు 30వ తేదీన జేపి దర్గాలో సబ్ కాంట్రాక్టర్లు అయిన హబీబ్ సయ్యద్, రఫీక్,నవాజ్ సయ్యద్, మహమూద్ సయ్యద్,అజ్మత్ల దగ్గర ప్రతినెల రూ.10,000 -వేలు రూ.20,000 వేలు వసూలు చేసేవాడనీ, ఏక మొత్తంలో 5.లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో సబ్ కాంట్రాక్టర్లు ఒప్పుకోలేదు.దీంతో ఆగస్టు 30న వారిని కట్టెలు చెక్కలు, చాకు, బజ్జీలు వేసే జాలితో విచక్షణారహితంగా కొట్టి గాయపరిచారనీ తెలిపారు. ఈ విషయంపై రఫీక్ ఫిర్యాదు చేయగా సిఐ నరసింహారావు, ఎస్సై జి శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్టు వివరించారు. ఆగస్టు 31న ఫయాజ్,సజ్జత్ మీర్జా, షౌకత్ సదాక్ అలియాస్ మహమ్మద్ సాదిక్, ఎండి హర్షద్ జమీల్ అన్సారి తిమ్మాపూర్ బస్ స్టేషన్ వద్ద కనిపించారనీ దీంతో వారిని అరెస్టు చేసి ఆదివారం నాడు రిమాండ్ కు తరలించినట్టు పేర్కొనజమీల్…

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్