E-PAPER

అడవి భూములు కాపాడవలసిన ఫారెస్ట్ అధికారులే అమ్ముకున్నారా!?

. పోడు భూముల్లో వాణిజ్య పంటలు

. భూస్వాములకే పూర్తి సహకారాలా!?

. ముడుపులకు బానిసలై పోడువైపు చూడని వైనం

. మీడియా వివరణ కోరగా బెదిరింపులు మండిపాటులు

. ఇదేం అరాచకం రా బాబోయ్ అంటున్న గిరిజన సంఘాలు

అశ్వరావుపేట,ఆగస్టు31, వై 7 న్యూస్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలో అడవులను కాపాడవలసిన అధికారులే పోడు భూముల పేరుతో భూస్వాములకు అడవి భూములు తాకట్టు పెడుతున్నారు. డబ్బు ఉన్న బడా బాబులకే వారి పూర్తి సహకారాలు అందిస్తూ భూములకు సాగు భూములకు ఫారెస్ట్ అధికారులే కాపలా దారులుగా మారుతున్న తీరు మండలంలో పలు విమర్శలకు దారితీస్తున్నాయి. ఇట్టి విషయంపై మీడియా ప్రతినిధులు ఎవరైనా చరవాణి ద్వారా సమాచారం అడిగితే మా విధులకు ఆటంకం కలిగిస్తున్నారు అంటూ బెదిరింపులకు దిగుతున్నారు. మమ్మల్ని ప్రశ్నిస్తే కేసులు పెడతాము అంటూ మండిపడుతున్నారు అంటూ స్థానిక జర్నలిస్టులు ఆరోపిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి అశ్వరావుపేట మండల పరిధిలో ఉన్న వినాయకపురం ముత్యాలమ్మ ఆలయం సమీపంలో కొందరు బడా భూస్వాములు పోడు పట్టా ఉందని సుమారు 15 ఎకరాల నుండి 20 ఎకరాల వరకు వ్యవసాయానికి అడవి ధ్వంసం చేసి సాగు చేస్తున్నారు. వ్యవసాయం పేరుతో వాణిజ్య పంటలకు అనుగుణంగా మార్చడం సంచలనం సృష్టిస్తుంది. విషయం తెలుసుకున్న క్యూ గ్రూప్ మీడియా గ్రామానికి చెందిన ఫారెస్ట్ గార్డు అధికారిని చరవాణి ద్వారా సమాచారం అడగగా మేము భూస్వాములపై కేసులు పెట్టము. అవి మా పోడు భూములు మేము అవి అడ్డుకునే ప్రయత్నాలు చెయ్యము మీరు పదే పదే మమ్మల్ని ప్రశ్నిస్తే మా విధులకు ఆటంకం కలిగిస్తున్నారు అంటూ మీపై కేసులు పెట్టడానికి కూడా మేము సిద్ధమే అంటూ తగరం హక్కులయ్యను బెదిరించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మా అడవి మా ఇష్టం మేము ఎవరికైనా కేటాయిస్తాం. ఏదన్న సమాచారం కావాలంటే మా పరిధిలో లేదు మీరు ఏ వార్తలైనా రాసుకోండి ఏ అధికారికైనా సమాచారం అందించండి మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ ఎటకారం గా సమాధానం చెప్పినట్లు తగరం అక్కులయ్య తోటి మీడియా మిత్రులకు తెలుపుతున్నారు. ఫారెస్ట్ భూముల్లో వాణిజ్య పంటలు ఎలా సాధ్యం అవుతున్నాయి అంటూ మండిపడుతున్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో అసలు ఎన్ని ఎకరాల పోడు పట్టా పుస్తకాలు మంజూరు అయినాయి ఎన్ని ఎకరాలు సాగులోకి తీసుకువచ్చారు అంటూ మండలంలో ఉన్న ప్రజల వద్ద నుండి భారీ స్థాయిలో విమర్శలు కొనసాగుతున్నాయి. స్థానిక ఫారెస్ట్ గార్డు విధులు సక్రమంగా నిర్వహించడం లేదా వారి వద్ద సమాధానం ఉంటుంది కదా ఎందుకు నిరాకరిస్తున్నారు అంటూ ప్రజలు గుసగుసలాడుతున్నారు. అధికారులు నిరాకరణ ఎందుకు అంటూ అనేక ప్రశ్నలతో మండలంలో యావత్తు విమర్శలు దారితీస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నత స్థాయి అధికారులు స్పందించి పోడు భూములలో వాణిజ్య పంటలు వ్యవసాయానికి ఎలా సాధ్యమవుతాయి. అసలు పట్టాలు ఎన్ని ఎకరాలు మంజూరు అయినాయి అనే విషయం ప్రజలకు తెలియజేయాలని మండల ప్రజలు కోరుకుంటున్నారు.ఫారెస్ట్ అధికారులు ముత్యాలమ్మ ఆలయ సమీపంలో భూస్వాములకు రహస్య వ్యవసాయానికి సంబంధించిన వివరాలు ప్రజల ముందు ఉంచాలి అంటూ అశ్వరావుపేట పట్టణ ప్రజలు ప్రత్యేకంగా కోరుకుంటున్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్