మిర్యాలగూడ,ఆగస్టు30 వై 7 న్యూస్;
మిర్యాలగూడ రైస్ మిల్ భవనం లో పోలీస్ వారు ఏర్పాటు చేసిన గణేష్ ఉత్సవ కమిటీ సభ్యుల తో మాట్లాడుతున్న డీఎస్పీ రాజశేఖర్ , టూ టౌన్ సిఐ నాగార్జున, వన్ టౌన్ సిఐ కరుణాకర్ ఎస్ఐలు, ప్రభుత్వ అధికారులు. ఈ సందర్భంగా డిఎస్పి రాజశేఖర్ మాట్లాడుతూ టౌన్ లో ను గ్రామాలలో ను గణేష్ ఉత్సవాలు నడిపే కమిటీ వారు విగ్రహల దగ్గర డీజే లు పెట్టకూడదని,మైకులు మాత్రమే పెట్టుకోవాలని ,నిమజ్జనం కార్యక్రమం వరుకు విగ్రహల దగ్గర 10 గంటలకు మైకులు బందు చేయాలని, పట్టణాల లోనూ, గ్రామాల లోనూ, ప్రజలకు ఇబ్బంది కలగకుండా పూజా కార్యక్రమాలు జరుపుకోవాలని, ప్రభుత్వ నిబంధనలు దిక్కరించి డీజే లు,సౌండ్బాక్స్ లు , మైకులు పెట్టి , ప్రజలకు ఇబ్బంది కలిగించే వారిపై కఠిన మైన చర్యలు తీసుకోని కేసులు నమోదు చేస్తాము అన్నారు.కార్యక్రమం లో ఉత్సవ కమిటీ సభ్యులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.









