E-PAPER

మన ఊరు – మన బడి కార్యక్రమం కింద మంజూరైన నిధులు ఎక్కడ ?

•శివాలింగపురం ప్రాథమిక పాఠశాల ఆవరణం పాములు తెళ్లు నిలయం

• అరకొర ఉపాధ్యాయులు ఉన్న ఉపాధ్యాయులను డిప్యూటేషన్ పేరుతో పెడుతూ బదిలీలు

మణుగూరు, ఆగస్టు 30 వై 7న్యూస్;
మణుగూరు మండలం లో గల మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని శివలింగపురం ప్రాథమిక పాఠశాల లో బాలురకు టాయిలెట్స్ ,మరుగుదొడ్లు లేక విద్యార్దులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పాఠశాల లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు కూడా టాయిలెట్స్ మరుగుదొడ్లు లేక అనేక అవస్థలు పడుతున్నారు అంటే అతిశయోక్తి లేదు.. మన ఊరు – మన బడి కార్యక్రమం కింద అమ్మ ఆదర్శ పాఠశాల పథకం ద్వారం ప్రభుత్వం ఎన్ని నిధులు మంజూరు చేసిన కూడా ఏ ఒక్క అభివృద్ది పనులు మాత్రం జరగడం లేదని సామాజిక కార్యకర్త కర్నె రవి ఆరోపించారు… మన ఊరు – మన బడి కార్యక్రమం కింద మంజూరైన నిధులన్నీ ఎక్కడ పెడతున్నరు అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఇకపోతే పాఠశాలలో తగినంత విద్యార్దులు ఉన్న విద్యార్దులకు తగినoతంగా ఉపాధ్యాయులు లేరు అనేది అక్షర సత్యం అని.. ఉన్న ఉపాధ్యాయులను డిప్యూటేషన్ పేరుతో జూలూరుపాడు బదిలీ చేశారు అని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆని కర్నె రవి తెలిపారు. పాఠశాలకు చుట్టూ పిచ్చి చెట్లు , ముళ్ళ పొదలు , పాములు, తెల్లు వంటివి తిరుగుతున్న అధికారులు మాత్రం ఆంటీ అంతనట్లుగా ఉన్నారు. పాఠశాలకు మన ఊరు – మన బడి కార్యక్రమం కింద మంజూరైన నిధులన్నీ ఖర్చు చేయకుండా పక్కదారి పట్టిస్తూ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లు శివలింగపురం ప్రాథమిక పాఠశాల పరిస్థితి ఉందని సామాజిక కార్యకర్త కర్నె రవి తీవ్ర ఆరోపణలు చేశారు..

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్