E-PAPER

ఆకట్టుకున్న వన్ కే రన్

విద్యార్థులు క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలి-పట్టణ సీఐ జి తిరుమల్ గౌడ్

హుజురాబాద్ ఆగస్టు 29 (వై 7 న్యూస్):
విద్యార్థులు చదువులో రాణిస్తూనే క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని పట్టణ సీఐ జి తిరుమల్ గౌడ్ అన్నారు. గురువారం జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక మాంటిస్సోరి పాఠశాల విద్యార్థులు అంబేద్కర్ చౌరస్తా నుంచి 1కే రన్ కార్యక్రమాన్ని తలపెట్టగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడాజ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
భారతదేశంలో ప్రతి సంవత్సరం ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుకుంటారనీ, దిగ్గజ హాకీ ఆటగాడు మేజర్ ధ్యాన్ చంద్ పుట్టినరోజును ఈ రోజు గౌరవిస్తుందనీ పేర్కొన్నారు. శారీరక దృఢత్వాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకొని విద్యాసంస్థలు క్రీడలను ప్రోత్సహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వేముల గోవర్ధన్, పాఠశాల ప్రిన్సిపాల్ గీతా షాజు, డైరెక్టర్స్ షాజు తామస్, గండ్ర సుధాకర్ రెడ్డి, నూకల శ్రీనివాసరావు, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, వ్యాయామ ఉపాధ్యాయులు రాజిరెడ్డి, సొల్లు సారయ్య, వాకర్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్