E-PAPER

ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులకు రుణమాఫీ చేయాలనిఅఖిల భారత రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో తాసిల్దార్ కు వినతిపత్రం

పాల్వంచ,ఆగస్టు27 ;
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయలు ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలని, ఆర్ గ్యారంటీ రాములు చేయాలని ఇలాంటి షరతులు లేకుండా ప్రతి రైతుకు కొత్త రుణాలు ఇవ్వాలని ఈరోజు పాల్వంచ పట్టణంలో అఖిల భారత రైతు కూలి సంఘం(AIKMS)మండల కేంద్రంలో ధర్నా నిర్వహించి తహసిల్దార్ వివేక్ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి AIKMS రాష్ట్ర నాయకులు ఎస్కే ఉమర్,న్యూడెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి గౌని నాగేశ్వరావు,జిల్లా సహాయ కార్యదర్శి కుంజ కృష్ణ, ప్రసంగించగా ఏఐకేఎంఎస్ మండల కార్యదర్శి కుంజా బూద్ర, అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమంలో పిఓడబ్ల్యు జిల్లా ఉపాధ్యక్షురాలు సోమ వినోద,నాయకులు మంకెన వెంకటేశ్వర్లు,ఏర్ణం శ్రీనివాస్, రాఘవులు, ఆరెంపుల రాజేష్, రమేష్,గోపి,బీమా,రూప్ సింగ్ వీరమ్మ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్