E-PAPER

తప్పుల తడకలో నియోజకవర్గం ఎన్ ఆర్ ఈ జి ఎస్

. సోషల్ ఆడిట్ లో వెలుగు చూస్తున్న నిజాలు

. గ్రామసభలలో నిజాలు కక్కుతున్న గ్రామస్థులు

అనపర్తి కోస్తావాణి వై7 న్యూస్ ప్రతినిధి :నియోజకవర్గంలోని నాలుగు మండలాలలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్కమకంగా తీసుకొన్న ఉపాధి హామీ పథకం నియోజకవర్గ గ్రామ ప్రజా ప్రతినిధుల సమక్షంలో జరుగుతుంది. మండల ఎన్ ఆర్ జి ఎస్ అధికారులు అలసత్వం వహించి నడచుకోవడంతో, ఫీల్డ్ ఆఫీసర్ నడచుకోవడంతో ఇష్టా రాజ్యంగా ఉపాధి హామీలో బిల్లులు చేసుకుని, నడచు కోవడటంతో పలువురు కూలీలకు డబ్బులు పడక పోవడంతో అడిగితే “మసి పూసి మారేడుకాయ” చేసిన చందాన అధికారులు నడచుకొంటున్నారు. తప్పుడు మస్తర్లు చూపించి పలువురు గ్రామ ఫీల్డ్ ఆఫీసర్ లు సంబందించిన మండల అధికారులకు ముడుపులు అందించి నడచుకొంటున్నారు.నియోజకవర్గంలో గ్రామ సభలలో జరుగుతున్న సోషల్ ఆడిట్లో పలు విషయాలు పలువురు ప్రస్తావించినా పట్టించుకోకుండా, తూతు మంత్రంగా నిర్వహిస్తూ గ్రామ సభలలో ప్రజలు అడిగిన ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు. ఎన్ ఆర్ ఈ జి ఎస్ స్కీమ్ ను మండల పరిధిలో అన్ని వ్యవస్థలకు అనుసంధానం చేయడంతో, గ్రామ సభలలో సోషల్ ఆడిట్ అధికారులు చెప్పిన ప్రతీ విషయంలో స్థానిక గ్రామస్తులు ప్రశ్నిస్తున్న, సంబంధిత శాఖల అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం నడచు కొని వివరాలు తెలుపుతున్నామని నీళ్లు నములుతున్నారు. మండల అభివృద్ధి అధికారులు పర్యవేక్షణ లోపం, ఎన్ ఆర్ ఈ జి ఎస్ ఏపిఓ ల సమక్షంలో గ్రామాల ఫీల్డ్ ఆఫీసర్ ల నిర్వాకం గ్రామ సభలలో సోషల్ ఆడిట్ విషయం లో బయట పడుతుంది. ఎన్ ఆర్ ఈ జి ఎస్ లో జరుగుతున్న అవినీతి గమనించి అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సంబంధిత విషయంలో తగు చర్యలు గైకొంటారని పలువురు నియోజకవర్గం ప్రజలు పేర్కొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్