E-PAPER

ఢిల్లీ లోని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ( AICC ) భవన్ ముందు మూడవ రోజుకు చేరుకున్న ఆందోళన కార్యక్రమం..

ఢిల్లీ ; లంబాడి గిరిజనులకు గిరిజన మంత్రి పదవి ఇవ్వాలని గిరిజన జేఏసీ అశోక్ రాథోడ్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమం మూడవ రోజుకు చేరుకుంది. సోమవారం ఢిల్లీలోని ( ఎ ఐ సి సి ) కార్యాలయం వద్ద గిరిజన లంబాడి జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్ష సోమవారం కూడా కొనసాగింది. తండాలు అభివృద్ధి చెందాలంటే గిరిజనులకే గిరిజన మంత్రి పదవి ఇవ్వాలని ప్లకాడ్ లతో నిరసన కార్యక్రమం చేస్తున్నామని నంగావత్ భాస్కర్ నాయక్ తెలిపారు. గిరిజన లంబాడి లకు రాష్ట్ర క్యాబినేట్ లో మంత్రి పదవి ఇచ్చేవరకు మా ఉద్యమాన్ని కొనసాగిస్తామని భాస్కర్ నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్