ఖమ్మం రూరల్ మండలం అరేంపుల వద్ద గోవుల అక్రమ రవాణాను టాస్క్ఫోర్స్ పోలీసులు గుర్తించారు. గురువారం రాత్రి నిర్వహించిన వాహన తనిఖీల్లో ఎలాంటి అనుమతులు లేకుండా డీసీఎం వాహనంలో 33 గోవులను తరలిస్తున్న ముఠాను పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలను టాస్క్ఫోర్స్ ఏసీపీ సత్యనారాయణ వెల్లడించారు. అక్రమంగా గోవులను తరలిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
వై 7 తెలుగు న్యూస్ | ఖమ్మం
Post Views: 67








