E-PAPER

నాని ప్యారడైజ్ పై బాబు మోహన్ ఫైర్.. కర్మ ఫలం అంటూ సంచలన వ్యాఖ్యలు.!

నాని హీరోగా నటించిన ‘ది ప్యారడైజ్’ సినిమా మేకర్స్‌పై సీనియర్ హాస్యనటుడు బాబు మోహన్ తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ చిత్ర యూనిట్ తనను అవమానించిందని, అందుకే వారికి ‘కర్మ’ తగిలి సినిమా బాక్సాఫీస్ వద్ద విఫలమైందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బాబు మోహన్ ఈ విషయాలను వెల్లడించారు.

సికింద్రాబాద్ నేపథ్యంలో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్ర కోసం చిత్ర యూనిట్ తనను సంప్రదించిందని బాబు మోహన్ తెలిపారు. “నాకు లుక్ టెస్ట్ చేశారు. మేకప్ వేసి, పలు రకాల కాస్ట్యూమ్స్ ప్రయత్నించారు. ఈ పాత్రకు మీరే సరిగ్గా సరిపోయారని మెచ్చుకున్నారు. షూటింగ్ మొదలైనప్పుడు కచ్చితంగా పిలుస్తామని చెప్పారు. కానీ ఆ తర్వాత వారి నుంచి ఎలాంటి సమాచారం రాలేదు” అని ఆయన వివరించారు.

సినిమా విడుదలయ్యే వరకు తాను వారి నుంచి పిలుపు కోసం ఎదురుచూశానని, అయితే ఎలాంటి స్పందన రాలేదని బాబు మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. “ఒకవేళ నన్ను ఆ పాత్రకు తీసుకోకపోయినా, కనీసం ఆ ఒక్క మాట చెప్పే మర్యాద పాటించాల్సింది. అది కూడా చేయకుండా అవమానించారు” అని ఆయన అన్నారు.

చిత్రం బాక్సాఫీస్ వద్ద నిజాం ఏరియా మినహా మిగతా ప్రాంతాల్లో పెద్దగా ఆడలేదని, కథనం నెమ్మదిగా ఉందనే విమర్శలు వచ్చాయని బాబు మోహన్ చురకలు అంటించారు. పరిశ్రమలో తనను చాలామంది ‘లక్కీ లెగ్’గా భావిస్తారని, గతంలో తాను లేని కొన్ని చిత్రాలు ఫ్లాప్ అయిన సందర్భాలను ఆయన గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు ఈ సినిమాకు కూడా అదే జరిగిందని, వారికి కర్మ ఫలం దక్కిందని వ్యాఖ్యానించారు.

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, నాని హీరోగా వచ్చిన ‘ది ప్యారడైజ్ ‘ చిత్రం విడుదలకు ముందు మంచి అంచనాలు రేపినప్పటికీ, ఆ తర్వాత ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. బాబు మోహన్ చేసిన ఈ వ్యాఖ్యలపై చిత్ర యూనిట్ ఇంకా స్పందించలేదు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!