చింతూరు, వై7 న్యూస్ తెలుగు, అక్టోబర్ 22: ఏడుగురాళ్ళపల్లి, పేగ పంచాయతీ పరిధిలో ఎన్నికల వాతావరణం ఊపందుకుంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) తరఫున ఏడుగురాళ్లపల్లి ఎంపీటీసీ అభ్యర్థిగా ఉయిక నాంచారి, పేగ ఎంపీటీసీ అభ్యర్థిగా తొడం రమాదేవి చింతూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు.

పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానుల సమక్షంలో వారు ఈ నామినేషన్ ప్రక్రియను పూర్తి చేశారు.
ఈ సందర్భంగా అభ్యర్థులు మాట్లాడుతూ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో గ్రామీణ ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే తమను భారీ మెజారిటీతో గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గ పార్టీ నాయకత్వం, స్థానిక ప్రజల మద్దతుతో పేగ పంచాయతీ, ఏడుగురాళ్ళపల్లి పరిధిలోని గ్రామాల అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి తాము నిరంతరం కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు.
వైఎస్సార్‌సీపీ జెండాలు, నినాదాలతో కార్యకర్తలు ఈ నామినేషన్ కార్యక్రమాన్ని ఒక ఉత్సవంలా నిర్వహించారు. స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్గొని అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ సాయశక్తులా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సొసైటీ చైర్మెన్ శ్యామల విజయ రెడ్డి,మాజీ వైస్ ఎంపీపీ ఎడమ అర్జున్,మాజీ సర్పంచ్ లు సవలం సత్తిబాబు, పాయం చంద్రయ్య, మాజీ ఎంపీటీసీ నాగరాజు,మాజీ ఉప సర్పంచ్ బి బాబురావు, నాయకులు పిసం పోదయ్య, సోడే సీతయ్య, లక్ష్మయ్య, ప్రవీణ్, ఉయిక బద్రు , కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.








