పంటల రక్షణకు రైతులు ప్రత్యామ్నాయ మార్గాలు అనుసరించాలి :డి.ఎస్.పి రవీందర్
ములుగు జిల్లా అక్టోబర్ 22 Y7 న్యూస్ తెలుగు
ములుగు జిల్లాలో డీఎస్పీ కార్యాలయం అటవి జంతువుల నుండి రక్షణ కోసం పంట పొలాలలో కరెంట్ ఉచ్చులు పెడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ములుగు డిఎస్పి రవీందర్ హెచ్చరించారు అటవి జంతువుల కోసం ఏర్పాటు చేసిన ఉచ్చుల వలన మనుషుల ప్రాణాలు పోతున్నాయని తద్వారా సంపాదించే కుటుంబ పెద్ద ప్రాణాలు కోల్పోయి వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని వెల్లడించారు ఇటీవల కాలంలో ములుగు మండలంలోని జాకారం గ్రామ పంచాయతీ పరిధిలో ఇలాగే పంట పొలాలలో కరెంట్ ఉచ్చులు పెడితే మనుషుల ప్రాణాలు పోయి సదరు వ్యక్తులు జైలు పాలు అయిన సంగతి గుర్తు చేశారు అందువల్ల పంటల రక్షణ కొరకు రైతులు ప్రత్యామ్నాయ మార్గాలు అనుసరించాలి అని కరెంటు ఉచ్చులు పెట్టీ అనవసరంగా జైలు పాలు కావద్దని హెచ్చరించారు ఎవరైనా వ్యక్తులు కరెంటు ఉచ్చులు పెట్టినట్టు తెలిసిన కనిపించిన వెంటనే పోలీసువారికి సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు








