దుమ్ముగూడెం: అన్ని దానాల్లో అన్నదానం మహా మిన్న అని సీఐ వెంకటప్పయ్య అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలోని చిన్నబండిరేవు గ్రామంలో నిర్వహిస్తున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం దుర్గాదేవి అవతారంలో దర్శనమిచ్చిన కనకదుర్గమ్మ అమ్మవారిని ఆయన దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా పురోహితులు భీష్మాచారి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులు సీఐ వెంకటప్పయ్య, ఎస్సై జగన్మోహనాచారిలను శాలువాలతో సత్కరించారు.
తదుపరి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని సీఐ వెంకటప్పయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భక్తిశ్రద్ధలతో దేవి శరన్నవరాత్రులు నిర్వహించడంతోపాటు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం ఎంతో శ్రేష్ఠమని అన్నారు. అన్నదానం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఉత్సవ కమిటీ సభ్యులను ఆయన అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు కొమ్ము నరేష్, బిల్లా చంద్రశేఖర్, కే. సుమంత్, ఎన్. నిఖిల్, బి. యశ్వంత్, టి. సంతోష్, సీహెచ్. గోకుల్, అన్నదాత శ్రీను తదితరులు పాల్గొన్నారు.
— Y7 News Telugu | ప్రజల గొంతుక








