E-PAPER

బతుకమ్మ, దసరా వేడుకల నేపథ్యంలో రౌడీషీటర్లకు పోలీసుల కౌన్సెలింగ్

భద్రాచలం: బతుకమ్మ, దసరా పండుగలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు భద్రాచలం పట్టణ పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఆదివారం భద్రాచలం పట్టణ పరిధిలోని రౌడీషీటర్లను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు.

పండుగల సమయంలో ఎలాంటి గొడవలు, ఘర్షణలు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకూడదని పోలీసులు సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు దూరంగా ఉండాలని స్పష్టం చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా ప్రవర్తించినా, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడినా, నిబంధనలు ఉల్లంఘించినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ప్రజలందరూ బతుకమ్మ, దసరా పండుగలను శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని భద్రాచలం పట్టణ సీఐ ఎస్. రాజు కోరారు. పండుగల సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులకు ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

— Y7 News Telugu

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!