దుమ్ముగూడెం, అక్టోబర్ 13 | Y7 న్యూస్ తెలుగు
ములకపాడు గ్రామపంచాయతీ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ)లో ఎన్నో ఏళ్లుగా నెలకొన్న తాగునీటి కొరత, వైద్య సిబ్బంది కొరత, పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆదివాసీ నాయకులు, సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో సంబంధిత అధికారులకు వినతిపత్రం అందజేశారు.
పీహెచ్‌సీలో ఒకే వైద్యుడితో పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందించడం కష్టంగా మారిందని, తాగునీటి సమస్యతో పాటు ఆసుపత్రి ఆవరణలో పారిశుద్ధ్య సమస్యలు కూడా వేధిస్తున్నాయని వారు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్యలను తక్షణమే పరిష్కరించి గిరిజన ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు.
ఈ వినతిపై స్పందించిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, సంబంధిత పీఓ అధికారులు సమస్యల పరిష్కారానికి త్వరలోనే ప్రత్యేక నిధులు మంజూరు చేసి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పరిషత్ తులసమ్మ, ఆదివాసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు స్వయం కమరాజు, సర్పంచుల సంఘం అధ్యక్షుడు మట్ట వెంకటేశ్వర్లు, తురం నవీన్, పోడియం సుబ్బారావు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తెల్లం హరికృష్ణ, మండల రెవెన్యూ అధికారి అశోక్ కుమార్, ఎంపీడీవో వివేకరం, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తదితర నాయకులు పాల్గొన్నారు.
Y7 News Telugu – ప్రజల గొంతుక









