చింతూరు, (వై7 న్యూస్ తెలుగు), సెప్టెంబర్ 29: చింతూరు మండలం, ఏడుగురాళ్లపల్లి గ్రామ పంచాయతీ లోని
దొంగల జగ్గారం గ్రామానికి చెందిన ప్రముఖ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ) నాయకులు తేజవత్ రాము అకాల మరణం చెందడం పార్టీకి తీరని లోటని పలువురు నేతలు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రాము భౌతికకాయానికి స్థానిక మాజీ జెడ్పీటీసీ చిచ్చడి మురళి తో పాటు పలువురు వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ మాట్లాడుతూ.. తేజవత్ రాము పార్టీ ఆవిర్భావం నుండి నమ్మకమైన కార్యకర్తగా, ప్రజల మనిషిగా విశేష సేవలు అందించారని కొనియాడారు. గ్రామంలో పార్టీ బలోపేతానికి ఆయన చేసిన కృషి ఎనలేనిదని గుర్తుచేసుకున్నారు. ఎల్లప్పుడూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ముందుండే ఒక మంచి నాయకుడిని కోల్పోవడం అత్యంత బాధాకరమని అన్నారు.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు తమ గాఢ సానుభూతిని తెలియజేశారు. పార్టీ అన్ని వేళలా వారి కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సంతాప కార్యక్రమంలో వైఎస్సార్ పార్టీ మండల కన్వీనర్ వై రామలింగారెడ్డి, మండల నాయకులు కోట్ల కృష్ణ,మాజీ సర్పంచ్ సవలం సత్తిబాబు,మాజీ ఎంపీటీసీ ఎడమ అర్జున్, మాజీ ఉప సర్పంచ్ బి బాబురావు, ధర్ముల విప్లవ కుమార్ , మరియు స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని రాముకు నివాళులర్పించారు.









