E-PAPER

పొదెం వీరయ్య బీఆర్ఎస్‌లోకి వెళ్తున్నారన్న ప్రచారం అవాస్తవం – కనుబుద్ది దేవా

దుమ్ముగూడెం, సెప్టెంబర్ 29 (Y7 న్యూస్):
భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పొదెం వీరయ్య బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని డీసీసీ మీడియా & కమ్యూనికేషన్స్ కో-ఆర్డినేటర్ కనుబుద్ది దేవా స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పొదెం వీరయ్య దాదాపు నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న నిబద్ధత కలిగిన నాయకుడని తెలిపారు. రాజకీయ జీవితంలో ఎన్నో ఒత్తిళ్లు, ఆటుపోట్లు ఎదురైనా పార్టీని వీడకుండా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేశారని పేర్కొన్నారు.2018లో భద్రాచలం ఎమ్మెల్యేగా ఎన్నికైన సమయంలో కూడా ఇతర పార్టీల నుంచి ప్రలోభాలు వచ్చినప్పటికీ వాటికి లొంగకుండా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగిన నాయకుడు పొదెం వీరయ్య అని కనుబుద్ది దేవా అన్నారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన నాయకుడిగా ఆయనకు కాంగ్రెస్ శ్రేణుల్లో ప్రత్యేక గౌరవం ఉందన్నారు.
అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా కార్యకర్తలు, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన నాయకుడు పొదెం వీరయ్య అని ఆయన పేర్కొన్నారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కొంతమంది కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు.
పొదెం వీరయ్య నాలుగు దశాబ్దాల రాజకీయ ప్రస్థానం, కాంగ్రెస్ పార్టీ పట్ల ఆయన చూపిన నిబద్ధతే ఇలాంటి ప్రచారాలకు సమాధానమని కనుబుద్ది దేవా అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు అసత్య ప్రచారాలను నమ్మకుండా వాస్తవాలను మాత్రమే విశ్వసించాలని ఆయన కోరారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!