E-PAPER

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం: కమాండెంట్ లక్ష్మీకాంత్ రావు

ములుగు, సెప్టెంబర్ 26 (Y7 News Telugu): తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలను 5వ బెటాలియన్ టీజీఎస్పీ, చెల్వాయి/ములుగు ప్రాంగణంలో శనివారం ఘనంగా నిర్వహించారు.

బెటాలియన్ కమాండెంట్ సి.వి. లక్ష్మీకాంత్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆమె ధైర్యసాహసాలు, సామాజిక న్యాయం కోసం చేసిన పోరాటం, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన సేవలను స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా కమాండెంట్ లక్ష్మీకాంత్ రావు మాట్లాడుతూ, చాకలి ఐలమ్మ అన్యాయాన్ని ఎదిరించి పేదల హక్కుల కోసం పోరాడిన మహోన్నత వ్యక్తిత్వమని పేర్కొన్నారు. ఆమె ధైర్యం, ఆత్మగౌరవం, పోరాట స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు. ఆమె ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజ అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో ఆర్‌ఐలు వెంకటేశ్వర్లు, భాస్కర్‌తో పాటు బెటాలియన్ అధికారులు, సిబ్బంది పాల్గొని చాకలి ఐలమ్మకు ఘన నివాళులర్పించారు. చాకలి ఐలమ్మ సేవలను గుర్తు చేసుకుంటూ ఆమె ఆశయ సాధనకు కట్టుబడి పనిచేయాలని ప్రతిజ్ఞ చేశారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!