E-PAPER

జనసేన తెలంగాణ ఆర్గనైజింగ్ సెక్రటరీగా గడల శ్రీనివాసరావు

పార్టీ సంస్థాగత బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తా

కొత్తగూడెం, సెప్టెంబర్ 26(y7 న్యూస్)

జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా తనను నియమించిన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు డాక్టర్ గడల శ్రీనివాసరావు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి కీలక బాధ్యత అప్పగించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ బాధ్యతను పదవిగా కాకుండా ప్రజలకు మరింత విస్తృతంగా సేవ చేసే అవకాశంగా భావిస్తున్నానని శ్రీనివాసరావు తెలిపారు. తన నియామకానికి సహకరించిన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి, తెలంగాణ ఇన్‌ఛార్జి నేమూరి శంకర్ గౌడ్‌తో పాటు పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆశయాలు, పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా సామాజిక న్యాయం, జవాబుదారీతనం, పారదర్శకత, అవినీతి రహిత పాలన వంటి విలువలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానన్నారు. తెలంగాణలో పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేసేందుకు తోటి నాయకులు, జనసైనికులు, వీర మహిళలతో సమన్వయంతో పనిచేస్తానని పేర్కొన్నారు.ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని వాటిని పార్టీ వేదికపై ప్రతిబింబించడం, గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీ నిర్మాణాన్ని పటిష్ఠం చేయడం తన బాధ్యతలో ప్రధాన అంశాలుగా ఉంటాయని తెలిపారు. తనపై ఉంచిన విశ్వాసాన్ని బాధ్యతగా స్వీకరిస్తూ, ఒక జనసైనికుడిగా అంకితభావంతో పనిచేస్తానని డాక్టర్ గడల శ్రీనివాసరావు స్పష్టం చేశారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!