చర్ల: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం వీరాపురం సమీపంలో గోదావరిలో 100 మందికి పైగా వ్యవసాయ కూలీలు చిక్కుకున్నట్లు సమాచారం.
గోదావరిలోని ఇసుకపాయ వద్ద ఒక్కసారిగా నీటి ప్రవాహం ఉద్ధృతంగా పెరగడంతో వ్యవసాయ పనుల కోసం వెళ్లిన కూలీలు నదీ ప్రవాహం మధ్యలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే అప్రమత్తమై సహాయక చర్యలు చేపడుతున్నారు. కాంగ్రెస్ నాయకుడు ఇర్ పవసంత్, స్థానికుడు యడారి శీను నేతృత్వంలో స్థానికులు కూలీలను సురక్షితంగా ఒడ్డుకు చేర్చేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.
ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Post Views: 108









