బూర్గంపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ముసలమడుగు గ్రామంలో గోవుల అక్రమ వ్యాపారం జరుగుతోందనే ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి.
వివిధ ప్రాంతాల నుంచి గోవులను ముసలమడుగు గ్రామానికి తరలించి, అక్కడి నుంచి వ్యాపారం నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వ్యవహారంలో గోవుల రవాణాకు సంబంధించిన అనుమతులు, నిబంధనలు పాటిస్తున్నారా? అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.
గోవుల రవాణా, విక్రయాలకు సంబంధించి ప్రభుత్వ నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనే దానిపై సంబంధిత అధికారులు సమగ్రంగా పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు.
ఈ ఆరోపణలపై అధికారులు విచారణ చేపట్టి వాస్తవాలను వెల్లడిస్తే పరిస్థితిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Post Views: 182









