E-PAPER

యునైటెడ్ ప్రెస్ క్లబ్ ఆఫ్ మణుగూరు నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

మణుగూరు: యునైటెడ్ ప్రెస్ క్లబ్ ఆఫ్ మణుగూరు నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జర్నలిస్టుల ఐక్యత, సంక్షేమం, వృత్తిపరమైన అభివృద్ధి లక్ష్యంగా నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేశారు.

నూతన కమిటీ పదవులకు ఎన్నికైన వారు:

1. గౌరవ అధ్యక్షులుగా: చిర్రా శ్రీనివాస్
2. అధ్యక్షులుగా: మాచర్ల శ్రీనివాస్
3. ప్రధాన కార్యదర్శిగా: పొన్నగంటి కృష్ణ
4. కోశాధికారిగా: స్టాలిన్
5. ఉపాధ్యక్షులుగా: చింతల లెనిన్, నక్క వాసు, మరసు సుధీర్

ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు, వారి సమస్యల పరిష్కారానికి, ఐక్యతను మరింత బలోపేతం చేసేందుకు నూతన కార్యవర్గం కృషి చేయాలని ఆకాంక్షించారు.

మణుగూరు ప్రాంతంలో జర్నలిస్టుల సంక్షేమం, వృత్తి గౌరవం, ప్రజాసమస్యలపై సమిష్టిగా పనిచేయడంలో యునైటెడ్ ప్రెస్ క్లబ్ కీలక పాత్ర పోషించాలని పలువురు అభిప్రాయపడ్డారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!