E-PAPER

నాయీబ్రాహ్మణుల ఆత్మగౌరవ భవనాల కోసం ఉద్యమాలకు సిద్ధం కావాలి

ములుగు: నాయీబ్రాహ్మణ కమ్యూనిటీ హాళ్లు (ఆత్మగౌరవ భవనాలు) ఏర్పాటు చేయడంతో పాటు, మేడారం జాతరలో 2004లో జరిగిన ఒప్పందాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యమాలకు సిద్ధం కావాలని నాయీబ్రాహ్మణ సంఘం నాయకులు పిలుపునిచ్చారు.

ములుగు జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయ ప్రాంగణంలో శుక్రవారం నాయీబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గౌరవ అధ్యక్షులు మద్దూరు రాములు, జిల్లా అధ్యక్షులు చిక్కుల వెంకటేష్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ములుగు జిల్లా కేంద్రంతో పాటు ఏటూరునాగారం, మేడారం ప్రాంతాల్లో నాయీబ్రాహ్మణ కమ్యూనిటీ హాళ్లు ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే మేడారం జాతరలో 2004లో నాయీబ్రాహ్మణులకు సంబంధించి జరిగిన ఒప్పందాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) సహకారంతో తమ డిమాండ్లను సాధించుకునే దిశగా చర్యలు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు జిల్లాలోని నాయీబ్రాహ్మణులు సంఘటితంగా ఉద్యమాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని నాయకులు పిలుపునిచ్చారు.

సమావేశంలో జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు చెన్న కుమార్, కార్యదర్శి ముత్యాల ప్రకాష్, కోశాధికారి దుబ్బాక ప్రవీణ్, జిల్లా కమిటీ సభ్యులు ముత్యాల రాజు, మద్దూరు రాజు, అన్నం తిరుపతి, కురిమిల్ల సంపత్, జంపాల చంద్రశేఖర్, నడిగోటి వేణు, మర్రిపెల్లి కిషన్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!