E-PAPER

అనుమానాస్పద స్థితిలో నర్సింగ్ విద్యార్థిని మృతి.. వెంకన్నపాలెంలో విషాదం

గాయాల ఆనవాళ్లతో అనుమానాలు..

దర్యాప్తు చేపట్టిన పోలీసులు..

జూలూరుపాడు, సెప్టెంబర్ 23 (Y7 News Telugu),
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంకన్నపాలెం గ్రామంలో నర్సింగ్ విద్యను అభ్యసిస్తున్న 18 ఏళ్ల దళిత యువతి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. మృతురాలు ఇంద్రపల్లి ఆరణిగా గుర్తించగా, ఆమె తల్లిదండ్రులు సతీష్, రాజేశ్వరిగా తెలిసింది.

కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, ఆరణి ఇంట్లోని బాత్‌రూమ్‌ పక్కన మృతదేహంగా కనిపించింది. మృతదేహంపై గాయాల ఆనవాళ్లు కనిపించినట్లు సమాచారం. దీంతో ఆమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నత చదువులు పూర్తి చేసి జీవితంలో స్థిరపడాలని కలలు కన్న యువతి అకాల మరణం కుటుంబ సభ్యులను, గ్రామస్తులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

ఘటన సమాచారం అందుకున్న జూలూరుపాడు సీఐ శ్రీలక్ష్మి, ఎస్‌ఐ జీనత్‌ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులను పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

యువతి మృతికి గల అసలు కారణాలు పోస్టుమార్టం నివేదిక, పోలీసుల విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!