బూర్గంపాడు;సెప్టెంబర్ 23 (y7newstelugu),
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం జింకలగూడెం గ్రామంలో మూఢనమ్మకాల పేరుతో వృద్ధురాలిపై జరిగిన అమానుష దాడి ఘటనను Y7 News Telugu వెలుగులోకి తీసుకురావడంతో రాష్ట్ర స్థాయిలో స్పందన వ్యక్తమైంది.
ఈ ఘటనపై వివిధ మీడియా కథనాలు, సామాజిక మాధ్యమాల్లో వచ్చిన సమాచారం ఆధారంగా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (TSHRC) సుమోటోగా కేసు నమోదు చేసి విచారణకు స్వీకరించింది. ఘటనపై పూర్తి నివేదికను అక్టోబర్ 27లోపు సమర్పించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది.
ఇదే సమయంలో ఘటనకు సంబంధించి షేక్ మదార్, షేక్ ఫయాజ్, కరీముల్లా తదితరులపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ సతీష్‌కుమార్ వెల్లడించారు.
ప్రజా సమస్యలు, అన్యాయాలపై నిరంతరం కథనాలు ప్రసారం చేస్తున్న Y7 News Telugu కథనానికి స్పందనగా అధికారులు చర్యలు చేపట్టడం గమనార్హం.







