ఖమ్మం, సెప్టెంబర్ 22 (Y7 News Telugu):
ఖమ్మం జిల్లాలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం త్వరలో ప్రత్యేక పోరాట కార్యక్రమాన్ని చేపట్టాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (TWJF) ఖమ్మం జిల్లా కమిటీ నిర్ణయించింది.
TWJF వ్యవస్థాపకులు మామిడి సోమయ్య ఆదేశాల మేరకు జిల్లా కమిటీ జర్నలిస్టుల సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను గుర్తించి, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు కమిటీ నాయకులు తెలిపారు.
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, అక్రిడిటేషన్లు, ఆరోగ్య సదుపాయాలు, జర్నలిస్ట్ సంక్షేమ పథకాలు తదితర అంశాలపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు కోరారు. మీడియా రంగంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు వెల్లడించారు.
జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం కోసం అవసరమైతే ఐక్యంగా ఉద్యమిస్తామని TWJF జిల్లా కమిటీ స్పష్టం చేసింది. త్వరలో చేపట్టనున్న ప్రత్యేక పోరాట కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లాలోని జర్నలిస్టులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చింది.







