E-PAPER

iQOO 16లో అదిరిపోయే డిస్‌ప్లే.. Samsungతో కలిసి కొత్త టెక్నాలజీ

స్మార్ట్‌ఫోన్‌ ప్రియులకు iQOO గుడ్‌న్యూస్‌ చెప్పింది. త్వరలో మార్కెట్‌లోకి రానున్న iQOO 16లో Samsungతో కలిసి అభివృద్ధి చేసిన అధునాతన డిస్‌ప్లేను అందిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. ‘Samsung Everest’ పేరుతో పిలుస్తున్న ఈ డిస్‌ప్లేతో ఫోన్‌ డిస్‌ప్లే విభాగంలో కొత్త అనుభూతిని అందించనున్నట్లు తెలుస్తోంది. iQOO 16 సెప్టెంబర్‌ చివర్లో అధికారికంగా లాంచ్‌ కానుంది.

iQOO, Samsung Display కలిసి నిర్వహించిన స్క్రీన్‌ టెక్నాలజీ కమ్యూనికేషన్‌ కాన్ఫరెన్స్‌లో ఈ వివరాలను ప్రకటించాయి. Samsung M16 లూమినసెంట్‌ మెటీరియల్‌ను ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌లో తొలిసారిగా iQOO 16లో ఉపయోగించనున్నారు. ఈ టెక్నాలజీ ద్వారా డిస్‌ప్లే నాణ్యత, విజువల్‌ అనుభూతి మరింత మెరుగుపడనున్నట్లు కంపెనీ పేర్కొంది.

ఈ డిస్‌ప్లే 2K రిజల్యూషన్‌తో పాటు 165Hz రిఫ్రెష్‌ రేట్‌ను అందించనుంది. ప్రపంచంలోనే తొలిసారిగా ఈ కాంబినేషన్‌తో మొబైల్‌ ప్యానెల్‌ను తీసుకొస్తున్నట్లు iQOO తెలిపింది. దీంతో గేమింగ్‌, వీడియోలు, ఇతర మల్టీమీడియా కంటెంట్‌ వినియోగంలో iQOO 16 డిస్‌ప్లే ప్రత్యేకంగా నిలిచే అవకాశం ఉంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!