ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో నటించిన పుష్ప 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి పాన్ ఇండియా స్థాయిలో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ తదుపరి సినిమా పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈయన ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో “రాకా “అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఇక ఈ సినిమా గురించి నిత్యం ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గత రెండు రోజులుగా ఈ సినిమాలో అల్లు అర్జున్ త్రిబుల్ రోల్ చేయబోతున్నారు అంటూ వార్తలు బయటకు వచ్చాయి అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరి కొన్ని వార్తలు హల్చల్ చేస్తున్నాయి.దీపికా పదుకొణె ప్రెగ్నెన్సీ లుక్, రష్మిక ఇంటర్వెల్ ఎంట్రీ వంటి కీలక అంశాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సినిమా నుంచి ఏ విధమైనటువంటి చిన్న విషయం కూడా బయటకు రాకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఇప్పుడు సినిమాకు సంబంధించి వరుస లీక్స్ రావడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఈ భారీ బడ్జెట్ సినిమా నుంచి వరుసగా లీక్స్ అవుతున్నప్పటికీ నిర్మాణ సంస్థ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల పలు సందేహాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే సినిమా నుంచి లీక్స్ వస్తున్నాయా? లేదంటే ప్రమోషన్ స్ట్రాటజీలో భాగంగా నిర్మాతలే ఇలా వ్యవహరిస్తున్నారా అంటూ అనుమానాలను వ్యక్తపరుస్తున్నారు. ఇప్పటివరకు ఈ లీకులపై మేకర్స్ ఎటువంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ.. చిత్ర పరిశ్రమలో దీనిపై తీవ్రమైన చర్చ నడుస్తోంది.
ఓ అత్యంత క్రేజీ ప్రాజెక్టును నిరంతరం వార్తల్లో ఉంచడం అనేది అభిమానులలో పెద్ద ఎత్తున క్యూరియాసిటీ పెంచేస్తుంది. ఇటీవల కాలంలో సినిమా మార్కెటింగ్ లో భాగంగా ఇలాంటి లీక్స్ చేయడం ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే.. ఏది ఏమైనా రాకా సినిమా నుంచి ఈ విధమైనటువంటి వరుస లీక్స్ రావడంతో ఇవి కాస్త సినిమా పట్ల భారీగా అంచనాలను పెంచేశాయి. మరి భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం పుష్ప రికార్డులను తిరగరాస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పనులు పూర్తి కాబోతున్నాయి. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాన్ని మరో తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నారు.








