E-PAPER

Himalayas Climate Change: హిమాలయాలకు పెరుగుతున్న ముప్పు.. నేపాల్‌లో విపత్తుపై ప్రధాని ఆందోళన

హిమాలయ పర్వత శ్రేణులు తీవ్రమైన పర్యావరణ ముప్పును ఎదుర్కొంటున్నాయి. నేపాల్‌లోని రసువా జిల్లా పరిధిలో ప్రవహించే భోటే కోశి నదిలో ఇటీవల సంభవించిన భారీ ప్రళయం దీనికి నిదర్శనంగా నిలిచింది. ఈ ఘటన సాధారణ వరద కాదని, హిమపాతం, మంచు కొండలు విరిగిపడటం వంటి అసాధారణ ప్రకృతి పరిణామాల కారణంగా ఈ మహా విపత్తు సంభవించిందని నేపాల్ ప్రధాని బాలేంద్ర షా ఆందోళన వ్యక్తం చేశారు.

వాతావరణ మార్పుల ప్రభావం హిమాలయ ప్రాంతాలపై తీవ్రంగా పడుతోందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా మంచు కరిగిపోవడం, హిమనదుల మార్పులు, ఆకస్మిక వరదలు వంటి పరిణామాలు భవిష్యత్తులో మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. హిమాలయాలపై ఆధారపడి జీవిస్తున్న ప్రజలు, పర్యావరణ వ్యవస్థలు ఈ మార్పులతో తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి.

పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలు విడుదల చేస్తున్న కార్బన్ ఉద్గారాల ప్రభావానికి చిన్న దేశాలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని బాలేంద్ర షా ఆవేదన వ్యక్తం చేశారు. వాతావరణ మార్పులకు తక్కువ కారణమైన దేశాలే ఎక్కువగా నష్టపోతున్నాయని ఆయన పేర్కొన్నారు. హిమాలయాల పరిరక్షణతో పాటు వాతావరణ మార్పులపై అంతర్జాతీయ సమాజం తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!