E-PAPER

ప్రభాస్ బర్త్‌డేకు బిగ్ సర్‌ప్రైజ్.. ‘మార్కో’ డైరెక్టర్‌తో ప్యాన్ ఇండియా స్టార్ మూవీ?

ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కొత్త సినిమా ఎప్పుడు ప్రకటిస్తారనే ఆసక్తి అభిమానుల్లో ఎప్పుడూ ఉంటుంది. ప్రస్తుతం ‘ఫౌజీ’, ‘కల్కి 2’ వంటి భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ప్రభాస్.. ఇవి పూర్తయిన తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్ 2’ను పట్టాలెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఓ క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉందనే వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.

మలయాళంలో యాక్షన్ డ్రామాగా సంచలనం సృష్టించిన ‘మార్కో’ ఫేమ్ దర్శకుడు హనీఫ్ అదేనితో ప్రభాస్ సినిమా చేయనున్నారనే ప్రచారం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. రా అండ్ రస్టిక్ యాక్షన్ కథలకు పేరుగాంచిన హనీఫ్ చెప్పిన ఓ పవర్‌ఫుల్ లైన్ ప్రభాస్‌కు నచ్చినట్లు సమాచారం. ఈ కాంబినేషన్‌ను సెట్ చేసేందుకు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రయత్నాలు చేస్తున్నారని టాక్. అంతర్జాతీయ స్థాయి నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

అయితే ప్రభాస్ ఇప్పటికే భారీ లైనప్‌తో బిజీగా ఉండటంతో ఈ ప్రాజెక్ట్ వెంటనే సెట్స్‌పైకి వెళ్లే అవకాశం లేదని తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2028లో సినిమా ప్రారంభమై.. 2029లో ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ ఉందనే అంచనాలు వినిపిస్తున్నాయి. అయితే ప్రభాస్-హనీఫ్ అదేని కాంబినేషన్‌పై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. కాబట్టి అక్టోబర్ 23న నిజంగానే ఈ బిగ్ ప్రాజెక్ట్‌ను ప్రకటిస్తారా అనేది ఆసక్తిగా మారింది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!