E-PAPER

Times Square Stabbing: టైమ్స్ స్క్వేర్‌లో కత్తితో దాడి.. మహిళ మృతి, నిందితురాలిపై పోలీసుల కాల్పులు

అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో సోమవారం మధ్యాహ్నం తీవ్ర కలకలం చోటుచేసుకుంది. అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో ఓ మహిళ అకస్మాత్తుగా ఇద్దరిపై కత్తితో దాడి చేసింది. ఈ ఘటనలో 32 ఏళ్ల మహిళ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా.. 68 ఏళ్ల వ్యక్తి గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని నిందితురాలిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు.

న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్ వివరాల ప్రకారం.. ఈ ఘటన మధ్యాహ్నం సుమారు 4:36 గంటలకు చోటుచేసుకుంది. కేవలం 20 సెకన్ల వ్యవధిలోనే ఇద్దరిపై కత్తితో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితురాలిని 49 ఏళ్ల పమేలా సిస్నెరోస్‌గా గుర్తించారు. కత్తిపోట్ల కారణంగా ఇద్దరు బాధితులను ఆసుపత్రికి తరలించగా.. మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది. మరో బాధితుడి పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అందులో పింక్ షర్ట్, జీన్స్ ధరించిన నిందితురాలు చేతిలో కత్తితో పోలీసుల ఎదుట కనిపించింది. కత్తిని కిందపడేయాలని పోలీసులు ఆదేశించినప్పటికీ ఆమె నిరాకరించడంతో పాటు పోలీసులను చంపేస్తానని బెదిరించినట్లు అధికారులు తెలిపారు. దీంతో పోలీసులు ఆమెపై కాల్పులు జరపగా నిందితురాలు మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!