నేపాల్లో వరదలు, కొండచరియల కారణంగా మృతుల సంఖ్య 469కి చేరింది. మరోవైపు సుమారు 1,550 మంది ఆచూకీ ఇంకా లభించలేదు. నేపాల్ టూరిజం బోర్డు ప్రకారం, గల్లంతైన విదేశీయుల్లో 178 మంది భారతీయులు ఉన్నారు.
చైనా నుంచి మరో హెచ్చరిక
టిబెట్–నేపాల్ సరిహద్దులో మరిన్ని వరదలు సంభవించే అవకాశం ఉందని చైనా నీటి వనరుల మంత్రిత్వ శాఖ లెవెల్-4 హెచ్చరిక జారీ చేసింది.
భారీ వరదలతో కొండచరియలు విరిగిపడి నదుల ప్రవాహానికి అడ్డుగా మారడంతో అక్కడ సుమారు 20 లక్షల క్యూబిక్ మీటర్ల నీటితో కృత్రిమ సరస్సు ఏర్పడినట్లు చైనా తెలిపింది. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో నీటిమట్టం మరింత పెరిగే ప్రమాదం ఉందని, రాబోయే 72 గంటల్లో తాత్కాలిక అడ్డుకట్ట తెగిపోయే అవకాశం ఉందని హెచ్చరించింది.
Post Views: 4








