డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల అంశాలు మరోసారి రాజకీయంగా వేడెక్కుతున్నాయి. వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడినా పార్లమెంట్ ఇంకా అధికారికంగా ప్రొరోగ్ కాలేదని కేంద్ర మంత్రి కిరెణ్ రిజిజు చేసిన వ్యాఖ్యలు ప్రత్యేక సమావేశాలపై ఊహాగానాలకు దారితీశాయి.
మరోవైపు, డీలిమిటేషన్‌పై కేంద్రం ప్రతిపాదనలను ప్రతిపక్షాలతో పంచుకోవాలని, మరో 25 ఏళ్లపాటు లోక్‌సభ స్థానాల సంఖ్యను పెంచవద్దని కోరుతూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులను తిరిగి ముందుకు తీసుకురావడానికి కేంద్రం కసరత్తు చేస్తోందన్న ప్రచారం నేపథ్యంలో, పార్లమెంట్‌ను ప్రత్యేకంగా సమావేశపరిచే అవకాశం ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో కొనసాగుతోంది.
Post Views: 4








