మలయాళ టీవీ, చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వెంకటేష్.వి.పి. ఇప్పుడు టాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘కింగ్డమ్’ సినిమాలో మురుగన్ పాత్రలో నటించి మంచి గుర్తింపు పొందిన ఆయన.. ప్రస్తుతం వ్యాపార రంగంలోనూ రాణిస్తున్నారు. ‘సుడా సుడా ఇడ్లీ’ అనే రెస్టారెంట్ స్టార్టప్‌ను విజయవంతంగా నిర్వహిస్తున్నారు.
‘కె ర్యాంప్’ వంటి కమర్షియల్ సక్సెస్ తర్వాత రుద్రాంశ్ సెల్యులాయిడ్ సంస్థ మరో కొత్త చిత్రాన్ని నిర్మిస్తోంది. సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ బొమ్మక్ శివ నిర్మిస్తున్న ఈ సినిమాలో ‘కింగ్డమ్’ ఫేమ్ వెంకటేష్.వి.పి. హీరోగా నటిస్తున్నారు. సురేష్ తేజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు ‘DGP’ అనే వర్కింగ్ టైటిల్‌ను ఖరారు చేశారు.
తిరువనంతపురం నేపథ్యంలో నిర్మాత బొమ్మక్ శివ, దర్శకుడు సురేష్ తేజ్ ఈ కొత్త సినిమాకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. వెంకటేష్.వి.పి. హీరోగా నటిస్తున్న తొలి చిత్రం కావడంతో సినిమాపై ఆసక్తి నెలకొంది. కథ, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు, షూటింగ్ వివరాలను త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.









