E-PAPER

Homemade Ghee: ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యి తయారు చేయడం ఎలా? ఈ సింపుల్ టిప్స్ పాటించండి!

మార్కెట్‌లో లభించే నెయ్యితో పోలిస్తే ఇంట్లో స్వచ్ఛమైన పాలమీగడతో తయారు చేసుకునే నెయ్యి రుచి, సువాసన ప్రత్యేకంగా ఉంటాయి. నెయ్యి తయారీలో ఉపయోగించే పదార్థాలు మనకు తెలిసినవే కావడంతో నాణ్యత విషయంలోనూ భరోసా ఉంటుంది. అందుకే చాలామంది ఇంట్లోనే నెయ్యి తయారు చేసుకోవడానికి ఆసక్తి చూపుతుంటారు.

అయితే నెయ్యి తయారు చేయాలంటే ఎక్కువ సమయం పడుతుందని, వెన్నను చేతులతో మథించడం ఇబ్బందిగా ఉంటుందని కొందరు భావిస్తారు. కానీ కొన్ని సులభమైన చిట్కాలు పాటిస్తే ఈ ప్రక్రియను చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా పాలపై పేరుకున్న మీగడను సేకరించి ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవాలి. తగినంత మీగడ వచ్చిన తర్వాత దానికి కొద్దిగా పెరుగు కలిపి రాత్రంతా ఉంచితే మరుసటి రోజు వెన్న తీయడం సులభమవుతుంది.

తయారైన వెన్నను ఒక గిన్నెలో వేసి తక్కువ మంటపై నెమ్మదిగా వేడి చేయాలి. వెన్న కరిగి నురుగు తగ్గి, బంగారు రంగులోకి మారి మంచి సువాసన వచ్చే వరకు మరిగించాలి. చివరగా నెయ్యిని వడకట్టి శుభ్రమైన పొడి గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఇలా ఇంట్లోనే సులభంగా, స్వచ్ఛమైన నెయ్యిని తయారు చేసుకోవచ్చు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!