మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ఐ యామ్ గేమ్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. నహాస్ హిదాయత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ఆగస్టు 20, 2026న థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ ప్రకటించారు. అయితే సినిమా కథకు సంబంధించిన వివరాలను రహస్యంగా ఉంచడంతో పాటు, రిలీజ్‌కు ముందే మంచి బజ్‌ను క్రియేట్ చేసింది.
ప్రస్తుతం ‘ఐ యామ్ గేమ్’ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో కొంత జాప్యం జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో అనుకున్న తేదీకి సినిమా థియేటర్లలోకి వస్తుందా? లేక చివరి నిమిషంలో వాయిదా పడుతుందా? అనే సందేహాలు మొదలయ్యాయి. అయితే ఇప్పటివరకు చిత్ర బృందం నుంచి రిలీజ్ వాయిదాపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
ఒకవేళ ‘ఐ యామ్ గేమ్’ ఆగస్టు 20 నుంచి వాయిదా పడితే, అదే రోజున విడుదల కానున్న పృథ్వీరాజ్ సుకుమారన్ ‘ఖలీఫా’కు ఇది కలిసొచ్చే అవకాశం ఉంది. ‘ఐ యామ్ గేమ్’ తప్పుకుంటే ‘ఖలీఫా’కు సోలో రిలీజ్ దక్కే ఛాన్స్ ఉండటంతో పాటు, మమితా బైజు నటించిన ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’కు కూడా పోటీ తగ్గే అవకాశం ఉంది. దీంతో దుల్కర్ సినిమా రిలీజ్‌పై మాలీవుడ్‌లో ఆసక్తి నెలకొంది.








