E-PAPER

Google Pixel 11 Series: ఆగస్టు 12న పిక్సెల్ 11 సిరీస్ లాంచ్.. ధరలు భారీగా పెరిగే అవకాశం!

గూగుల్ తన తదుపరి తరం Pixel 11 సిరీస్ స్మార్ట్‌ఫోన్లను ఆగస్టు 12న నిర్వహించనున్న ప్రత్యేక ఈవెంట్‌లో అధికారికంగా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్‌లో Pixel 11, Pixel 11 Pro, Pixel 11 Pro XL, Pixel 11 Pro Fold అనే నాలుగు మోడళ్లు ఉండనున్నాయి. అయితే గ్లోబల్‌గా మెమరీ కొరత, ఇతర భాగాల లభ్యతలో సమస్యల కారణంగా గత Pixel 10 సిరీస్‌తో పోలిస్తే ఈసారి ప్రతి మోడల్ ధర సుమారు 100 డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉందని సమాచారం. దీంతో బేస్ మోడల్ ధర సుమారు 899 డాలర్లు (రూ.85,600) నుంచి ఫోల్డబుల్ మోడల్ ధర 1,899 డాలర్లు (రూ.1.80 లక్షలు) వరకు ఉండొచ్చని అంచనా. ఖర్చులను నియంత్రించేందుకు ప్రో మోడళ్లలో బేస్ ర్యామ్‌ను 16GB నుంచి 12GBకి తగ్గించే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది.

Pixel 11 సిరీస్‌లో కొత్త కలర్ ఆప్షన్లను గూగుల్ అందించనున్నట్లు తెలుస్తోంది. స్టాండర్డ్ Pixel 11 మోడల్ హిబిస్కస్, ఫ్రాస్ట్, ఆబ్సిడియన్, పిస్తాచియో రంగుల్లో రానున్నట్లు సమాచారం. ఇక Pro మోడళ్లు డ్యూన్, లైట్ ఫాగ్, మిడ్‌నైట్ హేజ్, పైన్ కలర్ ఆప్షన్లలో లభించే అవకాశం ఉంది. డిస్‌ప్లే విషయానికి వస్తే.. Pixel 11లో 6.3 అంగుళాల Actua OLED స్క్రీన్‌తో పాటు 3,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ అందించనున్నట్లు అంచనాలు ఉన్నాయి. Pro, Pro XL మోడళ్లలో మరింత అధునాతన Super Actua LTPO OLED డిస్‌ప్లేలను అందించే అవకాశం ఉంది.

Pixel 11 Pro Fold ఈ సిరీస్‌లో అత్యంత ఖరీదైన మోడల్‌గా నిలిచే అవకాశం ఉంది. సుమారు 1,899 డాలర్ల ధరతో రానున్న ఈ ఫోల్డబుల్ ఫోన్‌పై టెక్ ప్రియుల్లో ఆసక్తి నెలకొంది. అయితే ధరలు, ర్యామ్, డిస్‌ప్లే, కలర్ ఆప్షన్లకు సంబంధించిన వివరాలు ప్రస్తుతం లీకులు, అంచనాల ఆధారంగానే ఉన్నాయి. గూగుల్ అధికారిక ప్రకటన తర్వాతే వీటిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!