E-PAPER

Motorola Edge 70 Neo: 200MP కెమెరాతో మోటరోలా కొత్త ఫోన్? లీకైన డిజైన్‌తో పెరిగిన అంచనాలు

మోటరోలా ఎడ్జ్ సిరీస్‌లో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. Motorola Edge 70 Neo త్వరలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. అధికారిక లాంచ్‌కు ముందే ఈ ఫోన్‌కు సంబంధించిన డిజైన్ రెండర్లు ఆన్‌లైన్‌లో లీక్ కావడంతో టెక్ ప్రియుల్లో ఆసక్తి పెరిగింది. లీకైన రెండర్ల ప్రకారం ఈ ఫోన్ పింక్, డార్క్ గ్రీన్, లైట్ గ్రీన్, లైట్ బ్లూ వంటి నాలుగు కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి రావచ్చని తెలుస్తోంది. వెనుక భాగంలో మ్యాట్ ఫినిష్ ఉండగా.. పింక్ వేరియంట్‌లో ప్రత్యేకమైన ప్యాటర్న్ కనిపిస్తోంది. డిస్‌ప్లే అంచులు వంపుగా ఉండే అవకాశం ఉంది.

Motorola Edge 70 Neo వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉన్నట్లు లీకైన రెండర్ల ద్వారా తెలుస్తోంది. ఇందులోని ఓ కెమెరా సెన్సార్‌పై 200MP అని పేర్కొనడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. దీంతో ఈ ఫోన్‌లో 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాను మోటరోలా అందించే అవకాశం ఉందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కెమెరా సెన్సార్, ఇతర హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్లపై కంపెనీ నుంచి ఇప్పటివరకు అధికారిక సమాచారం వెలువడలేదు.

లీకైన డిజైన్ ఆధారంగా Motorola Edge 70 Neo ఆకర్షణీయమైన ప్రీమియం లుక్‌తో రానున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నాలుగు కలర్ ఆప్షన్లు, కర్వ్డ్ డిస్‌ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్‌తో ఈ ఫోన్‌పై అంచనాలు పెరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం ఇవన్నీ లీకులు, అంచనాల ఆధారంగానే ఉన్నాయి. మోటరోలా అధికారికంగా ఫోన్‌ను ప్రకటించిన తర్వాతే కెమెరా, డిస్‌ప్లే, ప్రాసెసర్, బ్యాటరీ తదితర పూర్తి స్పెసిఫికేషన్లపై స్పష్టత రానుంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!